క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి 

ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను 

విజ‌య‌వాడ‌: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి అని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. కోవిడ్ కాలంలో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన  వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామిశెట్టి సాయి కోవిడ్ తో మరణించారు. ఈ సందర్భంగా అతని స్నేహితులు రామ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రామిశెట్టి సాయి సంగమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. కోవిడ్ తో మృతి చెందిన రమిశెట్టి సాయి పేరుమీద ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి తమ భవిష్యత్తును పాడు చేసుకోకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని అన్నారు. తద్వారా శారీరిక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని లభిస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా ప్రావీణ్యం పొందిన ఈ క్రికెట్ క్రీడలో యువత నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఇటీవల కాలంలో జరిగిన జగనన్న క్రీడా సంబరాలలో కూడా జగ్గయ్యపేట క్రికెట్ క్రీడాకారులకు జిల్లాలో 3వ స్థానం లభించడం గర్వకారణం అని అన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్, కౌన్సిలర్లు కొలగాని రాము, వట్టెం మనోహర్, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ మొహిద్దిన్, ఎస్టీ విభాగం అధ్యక్షులు బద్దు నాయక్, వాణిజ్య విభాగం అధ్యక్షులు చారుగుండ్ల కొండ, కార్మిక విభాగం అధ్యక్షులు గోగుల వెంకయ్య, నాయకులు శేషం ప్రసాద్,దువ్వల రామకృష్ణ, మరిశెట్టి కోటేశ్వరరావు, చిరంజీవి, డిపో మేనేజర్ ప్రసాద్,పట్టణ ఎస్ఐ రామారావు, క్రికెట్ కోచ్ రాజేంద్ర, రామిశెట్టి సాయి సంగమేష్ మెమోరియల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top