సీఎం ఏ బాధ్యత అప్పగించినా సైనికుడిలా పనిచేస్తా

ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎటువంటి బాధ్యత అప్పగించినా సైనికుడిలా పనిచేస్తానని ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంత్రి పదవుల నిర్ణయం పూర్తిగా సీఎందేనని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎటువంటి పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రభుత్వంలోకి తీసుకుంటారా.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది సీఎం వైయస్‌ జగన్‌ ఇష్టమన్నారు. ముఖ్యమంత్రి మాటకు తామంతా కట్టుబడి ఉంటామని, సీఎం చెప్పగానే మంత్రులంతా రాజీనామా చేశారు.. అదీ తమ కమిట్‌మెంట్‌ అని, సీఎం ఏ బాధ్యత అప్పగించినా సైనికుడిలా పనిచేస్తానని విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. 

Back to Top