ఏడాదిన్నరగా ఏపీలో సంక్షేమ పండుగ

ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పండుగ మొదలైందని ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఏడాదిన్నర పాలనలో దాదాపు రూ.80 వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారన్నారు. అసెంబ్లీలో ప్ర‌భుత్వ విప్ కొరుముట్ల శ్రీ‌నివాసులు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలును, ప్రజలకు జరిగే మంచిని చంద్రబాబు, టీడీపీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గత నాలుగు రోజులుగా చర్చలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులకు సభా సంప్రదాయాలు, నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించాలని, సభలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారన్నారు. 
 

Back to Top