2024లో చంద్రబాబు పార్టీని మూసుకోవాల్సిందే

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి తెలుగుదేశం పార్టీకి కన్నుకుట్టిందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా రాయచోటిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. పారదర్శక పాలనను చూసి టీడీపీకి కన్నుకుట్టిందని, అందుకే కుట్రలు, కుతంత్రాలతో అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడని ఫైరయ్యారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకు ఏం చేయాలో సీఎం వైయస్‌ జగన్‌కు బాగా తెలుసన్నారు. 2024లో చంద్రబాబు తన పార్టీని మూసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top