ప్ర‌జా మ‌ద్ద‌తు స‌ర్వేతో ప్ర‌తిప‌క్షాల‌కు నిద్ర క‌రువు

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్‌

ఎచ్చెర్ల‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న మెగా స‌ర్వేతో ప్ర‌తిప‌క్షాల‌కు నిద్ర క‌రువైంద‌ని ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్ పేర్కొన్నారు. మెగా పీపుల్స్ సర్వేకు క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనతో ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయ‌న్నారు.  ప్రతిపక్షాలు బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు అందుతున్న లబ్ధిని వివరిస్తూ.. మెగా సర్వేలో ముందుకు సాగుతూ వైయ‌స్ఆర్‌సీపీ చూపుతున్న సానుకూల ధోరణితో ప్రతిపక్ష పార్టీ నిద్రలేని రాత్రులను గడుపుతోంద‌న్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ "జగనన్నే మా భవిష్యత్తు" మా నమ్మకం నువ్వే జగన్ కార్య‌క్ర‌మంపై ప్ర‌జా స్పంద‌న‌ను ఎమ్మెల్యే మీడియాకు వివ‌రించారు.  

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల సచివాలయాల్లో  "జగనన్నే మా భవిష్యత్తు"పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు తమ  పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నార‌ని చెప్పారు.

 ఈ మెగా పీపుల్స్ సర్వే కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలు.. మధ్యంతర ఫలితాల నివేదికను మీడియా ముఖంగా వెల్లడిస్తున్నాం. మెగా సర్వేలో వస్తున్న ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.  అసాధారణమైనవిగా ఉన్నాయి!  జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వేలోని తొలి 15 రోజుల్లో కోటి కుటుంబాలు పాల్గొనగా.. సీఎం జగనన్న పాలనకు మద్ధతుగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయ‌న్నారు.

మెగా సర్వేలో భాగంగా మన నియోజకవర్గంలో మేము ఇంత వరకు ఎచ్చెర్ల నియోజకవర్గం లో నాలుగు మండలాల్లో 94623కుటుంబాలను గాను 58780ఇల్లు సందర్శించాము. రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని సందర్శించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామ‌ని చెప్పారు.

రాష్ట్రంలోని మొత్తం 1.65 కోట్ల కుటుంబాలను 100 శాతం కుటుంబాలను సందర్శించడమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యం. కుల, మత, వర్గ, వివక్ష లేకుండా..  ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయని భావించే ప్రాంతాలపై దృష్టి సారించి, సీఎం జగనన్న పాలనలో అక్కడి ప్రజలకు జరిగిన మంచిని వివరించాలనే ఉదేశ్యంతో వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు వెళుతోంది.

ఈ రోజు మెగా సర్వేలో వచ్చిన అద్భుత ఫలితాలు.. ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన గురించి మీకు తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగనన్నపై ప్రజలకు ఉన్న నమ్మకం మాటల్లో చెప్పలేనిది. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.  మీలోని ప్రతి ఒక్కరూ ఏదైనా సచివాలయాన్ని సందర్శించి, కార్యక్రమం జరుగుతున్న తీరు దానికి ప్రజల నుంచి వచ్చే ప్రతిస్పందనను స్వయంగా చూడమని ఆహ్వానిస్తున్నాం. 

 మనం ప్రజల ఇళ్లను నేరుగా సందర్శించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రమే  నిజమైన అభివృద్ధిఅంటే ఏంటో చూడగలం. ప్రస్తుతం వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త నుంచి నాయకుల వరకు దీన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ పొందుతున్న వృద్ధుల ఆశీస్సుల్లో ఇది కనిపిస్తుంది. అమ్మ ఒడి కృతజ్ఞతతో పిల్లలను బడికి పంపుతున్న తల్లుల చిరునవ్వుల్లో ఇది కనిపిస్తుంది. తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు సీఎం జగనన్న సారథ్యంలో ఆర్థిక సాయం అందుకున్న వ్యాపారుల ఆత్మవిశ్వాసంలో ఇది కనిపిస్తుంది. వైయ‌స్ జగన్ ప్రభుత్వ విదేశీ దీవెన పథకం కింద విదేశాల్లో డిగ్రీ పట్టా పొందే అవకాశం యువతరం కళ్లలో ఇది కనిపిస్తోంది. సొంతింటి కలను బాధ్యతగా భావించి పేద ప్రజల కోసం ప్రభుత్వం నెరవేరుస్తున్నప్పుడు నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది.ఇదే నిజమైన అభివృద్ధి అని, కుల, వర్గ, రాజకీయాలకు అతీతంగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రజలు సీఎం వైయ‌స్ జగనన్న పై తమ విశ్వాసం వ్యక్తం చేశారు.*

 నవరత్నాల హామీలను 100 శాతం నెరవేర్చిన సీఎం జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రానున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మక ఈ మెగా సర్వే మరియు క్షేత్ర స్థాయి పర్యటనల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ, వారి పిల్లల భవిష్యత్తు కోసం విశ్వసించే ఏకైక వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్ అని తేటతెల్లం కానుంది.
ఈ కార్యక్రమంలో లావేరు,జి.సిగడాం మండలం ఎంపీపీ ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ,మీసాల వెంకటరమణ,జడ్పీటీసీలు టొంపల సీతారాం,మీసాల సీతంనాయుడు,కాయల రమణ,మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు,దన్నాన రాజినాయుడు,జరుగుళ్ల శంకరరావు,జే.సి.యస్ మండల ఇంచార్జ్ లు చిల్ల వెంకటరెడ్డి,మీసాల శ్రీనువాసరావు,మూగి శ్రీరాములు నాయుడు,డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీలు రాయపురెడ్డి బుజ్జి,మైలపల్లి కామరాజుబీసీ సెల్ కార్యదర్శి బాల్లాడ జనార్దన్ రెడ్డి, ఎస్ఎం పురం,జి.సిగడాం పీఏసీఎస్‌ చైర్మన్లు సనపల నారాయణరావు, వై.ప్రకాష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top