పాపం పల్లిలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

  ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఘ‌న స్వాగ‌తం

నెల్లూరు: దుత్తలూరు మండలం పాపం పల్లి పంచాయతీలో గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  ప్రారంభించారు. గ్రామస్తులు  ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు.  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శాంతి కుమారి, సొసైటీ చైర్మన్ గుండెల గురవా రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ చేజర్ల చలమారెడ్డి , మాజీ సర్పంచ్ శివ, మాజీ సొసైటీ చైర్మన్ కామేశ్వరి, పాపం పల్లె పంచాయతీ సచివాలయ సిబ్బంది, ఎంపీడీవో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top