ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు

శ్రీ‌కాకుళం:  ప్ర‌తి గ‌డ‌ప‌కు సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయ‌ని ల‌బ్ధిదారులు సంతోషం వ్య‌క్తం చేశారు. వెంకటాపురం గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నిర్వ‌హించారు.  109వ రోజు 206 గడపల ప్రజలను క‌లిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు.

ఈ సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయని,అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రభుత్వం పనిచేసిందన్నారు.గతంలో సంక్షేమానికి తూట్లు పొడిచి జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పజెప్పి ఇంటిపై జెండా కడితేనో లేదా పార్టీ కండువా కప్పుకుంటేనో సంక్షేమ పథకాలు ఇచ్చే వారిని,కానీ నేడు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అర్హులు అయితే చాలు సంక్షేమ పథకాలను వైయస్ జగన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యా -వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు మరింత మేలు చేకూరేలా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ చర్యలు తీసుకున్నారన్నారు.పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన ఉచిత విద్య,మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అర్హత కలిగిన ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకొని లబ్ధిని పొందాలని సూచించారు

ఈ కార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ,జడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనువాసరావు,రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కింతలి రమేష్ బాబు, లావేరు పీఏసీఎస్ చైర్మన్ బూరాడ చిన్నారావు, లావేరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు షేక్ చాంద్ భాష,మండల మహిళా అధ్యక్షురాలు మహాంతి విజయలక్ష్మి, వెంకటాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బొంతు అరుణయల్లంనాయుడు, అప్పాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ జగ్గురోతు సత్యనారాయణ, వైస్ సర్పంచ్లు మీసాల నీలం నాయుడు, శనపతి అపర్ణ,యడ్ల యోహన్,వెంకటాపురం, అప్పాపురం గ్రామ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నింటి సత్యం,వావిల్ల రామారావు,శంభాన మహాలక్ష్మినాయుడు,శంభాన కొండలరావు,బొంతు నర్సింహులు,గేదెల సూర్యారావు,వావిల్ల తమ్మినాయుడు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top