నాల్గ‌వ రోజు బ‌స్సుయాత్ర నంద్యాల‌లో ప్రారంభం

భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు, పార్టీ నాయ‌కులు

నంద్యాల‌: సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరింది. నంద్యాలలో ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు సాయంత్రం అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది. సామాజిక న్యాయ‌భేరి బ‌స్సుయాత్ర‌కు ప్ర‌జ‌లంతా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. నంద్యాల‌లో భారీ ర్యాలీలో నాల్గ‌వ రోజు యాత్ర ప్రారంభ‌మైంది. వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే శిల్ప ర‌వి ఆధ్వ‌ర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అందిస్తున్న రాజ్యాధికారాన్ని, చేస్తున్న మంచిని మంత్రులు వివ‌రిస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు బ‌స్సు యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. భారీ జ‌న‌సందోహం మ‌ధ్య మంత్రుల బ‌స్సుయాత్ర ముందుకుసాగుతోంది. 

Back to Top