సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌

తాడేప‌ల్లి: సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి  క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ అధినేత,  వైయ‌స్ జగన్‌ సమక్షంలో సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వెంకటేశ్వర రెడ్డితో పాటు  ఆయన కుమారుడు నితిన్‌ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్‌ పక్కాల సూరిబాబు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలో సాద‌రంగా ఆహ్వానించారు. సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వర రెడ్డి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. కార్య‌క్ర‌మంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్‌ గాదె సుజాత పాల్గొన్నారు.

Back to Top