అమరావతి: బాపట్ల మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ నేత నందిగం సురేశ్‌ను ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. నందిగం సురేశ్ మియాపూర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఏపీకి తరలించారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేశ్‌పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే.. వారిని గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందిగం సురేష్ అక్రమ అరెస్టు పట్ల ఆయన సతీమణి బేబిలత తీవ్రంగా ఖండించారు. సురేష్‌కు ఏమైనా జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు