నాటి మోసపు పాలన..నేటి విశ్వసనీయత పాలనకు తేడా చూడండి

 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి.

అనంత‌పురం: నాటి చంద్రబాబు మోసపు పాలనకు నేటి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి విశ్వసనీయత పాలనకు ఉన్న తేడాని పట్టభద్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కోరారు. తేడా కనిపడితేనే వైయ‌స్ఆర్‌సీపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అభ్య‌ర్థించారు. సోమవారం బెలుగుప్ప మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలువురు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లను కలిశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి రామచంద్రారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వానికి వైయ‌స్ జగన్ సీఎం అయిన తరువాత మార్పును పోల్చుకోని ఓటు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడపను  తట్టాయన్నారు. సచివాలయ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ప్రజల వద్దకే పాలన వెళ్లిందన్నారు. దేశంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ తో 1.36 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం జరిపిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఒక్కడే అన్నారు. మెరుగైన విద్య కోసం అమ్మవడి,విద్యా దీవెన,ట్యాబ్ లు పంపిణీ వంటి వాటితో పాటు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నాడు-నేడు కింద వేల పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు.  రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, పేదలకు మెరుగైన విద్య ఇలాగే కొనసాగలన్నావైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.   

Back to Top