ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్రతో పార్టీ మరింత బలోపేతం

 ఈసారి 175 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తాం

 మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

 ఉరవకొండ: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ఆ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఉరవకొండ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో 'ప్రజా సంక్షేమ పాదయాత్ర' చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. బుధవారం  పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి నుంచి పెద్దారెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఆయనతో పాటు విశ్వేశ్వరరెడ్డి కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో పాల్గొన్న అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్ర తాడపత్రి రాజకీయాల్లో ఒక సంచలనం అన్నారు. గతంలో ఇంతటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో ఎవ్వరూ చేసిన పాదయాత్రలు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ నేడు ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కేతిరెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర పార్టీకి ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పారు. అదే విదంగా ఈ పాదయాత్రతో ఆయన గెలుపు సునాయాసంగా మారనుందని మరో 20 ఏళ్లు పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడని ఆయన జోష్యం చెప్పారు.ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను చేపట్టడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు చేస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల మనసును చూరగొంటున్నారన్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ  గెలుచుకోవడం ఖాయమని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

Back to Top