ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ధ్యేయం

జయపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉరవకొండ: రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా, పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న సాగుతోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉర‌వకొండ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కూడేరు మండలం జయపురం గ్రామంలో విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామస్తులు విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి సీఎం వైయ‌స్ జగన్ అందిస్తున్న  సంక్షేమ పథకాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నార‌ని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top