పేదల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌

విజ‌య‌వాడ‌: పింఛ‌న్ల పంపిణీని అడ్డుకుంటున్న చంద్ర‌బాబుకు పేద‌ల ఉసురు త‌గులుతుంద‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికీ అవ్వతాతలకు పెన్షన్ అందలేదని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఏమ‌న్నారంటే..

 • ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం వైయ‌స్‌ జగన్‌ను గెలిపిస్తారు.
 • ఇంటికి వచ్చే పెన్షన్‌ని దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు.
 • చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్,  షర్మిల, పవన్ కళ్యాణ్ పేద ప్రజల మీద కక్ష కట్టారు.
 • సుమారు 65 లక్షల మంది పెన్షన్లను ఎల్లో టీమ్‌ నిలిపివేశారు. 
 • పెన్షన్‌దారులు చంద్రబాబు అండ్ టీమ్‌కి బుద్ధి చెప్పేందుకు సిద్ధం.
 • వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు పెన్షన్ ఏ విధంగా పంపిస్తారు.
 • 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టావా?.
 • చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లన్నీ ఎత్తివేసి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇస్తారంట.
 • ఇలాంటి దుర్మార్గులకి ఓటు ఎందుకు వేయాలి.
 • జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ సానుభూతిపరులకే పెన్షన్లు ఇస్తారు.
 • కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు.
 • బుద్దా వెంకన్న, పోతిన మహేష్, వర్ల రామయ్యకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం.
 • టీడీపీ అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతుంది
 • నారా లోకేష్ ప్రజల పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.
 • రాష్ట్రంలో నారా లోకేష్‌తో పనిలేదు.
 • జనసేన కార్యకర్తలను, నాయకులను పవన్ మభ్యపెడుతున్నాడు.
 • పవన్ మాటలకు పొంతనే ఉండదు.
 • ఆంధ్ర రాష్ట్రంలో ఒక సొంతిల్లు అయినా ఏర్పాటు చేసుకో.
 • పవన్ గతంలో పాచిపోయిన లడ్డులు అని మోదీ కాళ్లు పట్టుకున్నాడు.
 • మీ కన్న తల్లిని తిట్టిన వారితో నువ్వు పొత్తు పెట్టుకుని పల్లకీ మోస్తున్నావ్‌. 
 • వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
 • పవన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు.
 • పేదల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది.
 •  
Back to Top