ముసుగు తొలగింది.. బాబు–పవన్‌ల బంధం బయటపడింది

ముందు నుంచి వైయస్‌ఆర్‌ సీపీ చెబుతుంది ఇవాళ నిజమైంది

కాపులను గంపగుత్తగా చంద్రబాబుకు అమ్మేసేందుకు పవన్‌ ప్రయత్నం

కాపు నేత ముద్రగడ్డ కుటుంబాన్ని హింసించినప్పుడు ఎక్కడున్నావ్‌..?

కాపులంతా వైయస్‌ జగన్‌ వెంట, వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారు, ఉంటారు

అరేయ్‌ సన్నాసి.. నాలుక చీరేస్తా అని నేను అనలేనా..? మాకు సంస్కారం ఉంది

వైయస్‌ఆర్‌ సీపీలోని కాపు ఎమ్మెల్యేలందరినీ నా కొడకల్లారా అంటే నీ బలుపు ఏంట్రా

మొత్తం 30 మందిని నువ్వే పంపించావా..? స్టెపినీల సప్లయ్‌ కంపెనీనా నీది..?

175 స్థానాల్లో పోటీచేస్తానని చెబితే ప్యాకేజీ స్టార్‌ మాటను వెనక్కి తీసుకుంటాం

2024లో చంద్రబాబు బూట్లు నాకను అని చెబితే ఆ మాటను వెనక్కు తీసుకుంటాం

రాజకీయ పార్టీ పెట్టి ఒక్కచోట కూడా పోటీచేయకపోతే ప్యాకేజీ కాక మరేంటి..?

నీ పక్కన నాదెండ్ల మనోహర్‌ ఏం చేస్తున్నాడు. నీ కాళ్లు ఒత్తుతున్నాడా..?

ఇంత నిర్లజ్జగా, పచ్చిగా మాట్లాడే రాజకీయ పార్టీ అధ్యక్షుడు దేశ చరిత్రలో ఎవరూలేరు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వ‌జం

తాడేపల్లి: నిన్నటి వరకు బీరాలు పలికిన దత్తపుత్రుడు ముసుగు ఇవాళ తొలగించాడు.  ఈ ముసుగు వెనకాల చంద్రబాబుకు గులాం గిరి ఉంది. ప్రజలను, తన అభిమాన సంఘాలను మోసం చేసే ప్రక్రియ ముసుగుచాటున చేస్తున్నాడు. జనసేన అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా కాపులను గంపగుత్తగా తీసుకెళ్లి  చంద్రబాబుకు అప్పగించడం పవన్‌ కల్యాణ్‌ అంతిమలక్ష్యం అని కృష్ణాజిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ చీకటి బంధం గురించి వైయస్‌ఆర్‌ సీపీ మొదటిరోజు నుంచి చెబుతుంది ఇవాళ నిజమైందని, దత్తపుత్రుడు ముసుగు తొలగించడం సంతోషం అన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకొని, చంద్రబాబు పంచన చేరుతున్నానని సన్నాసిన్నర సన్నాసి చెప్పకనే చెప్పాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు.

పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..
‘భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటున్నాను కానీ, వారితో కలిసి ఉద్యమం చేయడానికి మనసురావడం లేదు.. నాకు నచ్చడం లేదని తెగదెంపులు కూడా చేశాడు. ఈ సంగతి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసు అని అంటున్నాడు. రాజకీయ ముఖచిత్రం మార్పు అంటే చంద్రబాబుతో కలిసి వెళ్తానని చెబుతాడు. అది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్‌ పిల్లోడిని అడిగినా పవన్‌ కల్యాణ్‌ 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో వెళ్తాడని చెబుతారు. ఈ ముసుగు తీయమనే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి డిమాండ్‌ చేస్తున్నాం. తరుణం వచ్చింది.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. సంవత్సరం 9 మాసాలకు వచ్చాం. ఇక ముసుగు తీసి మెల్లగా చంద్రబాబు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి సమయం, లగ్నం దగ్గరపడినట్టుగా పవన్‌ మాటల్లో అర్థం అవుతుంది. 

వైయస్‌ఆర్‌ సీపీ గూండాలను చొక్కాపట్టుకొని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొడతాడని పవన్‌ మాట్లాడుతున్నాడు. అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వైయస్‌ఆర్‌ సీపీలో గూండాలు లేరు. అలాంటి వారు ఉన్నది పవన్‌ కల్యాణ్‌ దగ్గరే కాబట్టి తన వెనకాల ఉన్నవారిని లాక్కొచ్చి కొట్టాల్సిందే తప్ప.. వైయస్‌ఆర్‌ సీపీలో గూండాలు లేరు కాబట్టి ఆ అవకాశంలేదు. 

ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి.. 175 స్థానాల్లో ఒక్క చోట కూడా అభ్యర్థిని పెట్టకుండా బీఫాం ఇవ్వకుండా, ఆఖరికి ఆ పార్టీ పెట్టినోడు కూడా పోటీ చేయకుండా పలానా వాడికి ఓటు వేయండి అని చెబితే.. ప్యాకేజీ ఉంటే అంటారా.. ప్యాకేజీ లేకపోతే అంటారా..? రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదా పెట్టేది..? మరి ఎందుకు 2014లో పోటీలో పాల్గొనలేదు. 

2019లో భారతీయ జనతా పార్టీని పచ్చి బూతులు తిట్టి, మోడీని తిట్టి, నిర్ణయాధికారం లేని వెంకయ్యనాయుడిని తిట్టి, చంద్రబాబును కాకుండా ఆయన కొడుకును వెధవ, సన్యాసి అని గుంటూరులో తిట్టి, కమ్యూనిస్టు పార్టీలు, మాయవతితో జతకట్టి పోటీచేసి చివరి క్షణం వరకు టీడీపీకి అనుకూలంగా అభ్యర్థులను, పొత్తులను మార్చుతూ వచ్చిన తంతును ప్యాకేజీ అనక మరేమంటారు..? ఎన్నికలు అయిన తెల్లారే బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని వారి సంకనెక్కడాన్ని ఏమంటారు..? బూతులు తిట్టిన నోరు తడి కూడా ఆరకముందే.. ఆ పార్టీ సంకలోకి వెక్కి అంటకాగడం దేనికి..? నీ రాజకీయ పార్టీకి ఏం విలువలు ఉన్నాయి. చంద్రబాబు ఎలాగైనా గెలవాలని అంటున్నాడు. బీజేపీని కూడా చంద్రబాబుతో కలిసి వెళ్దామని, లేకపోతే వారి తీరునచ్చలేదని మాట్లాడుతున్నాడు. మరి ఇదంతా ప్యాకేజీ కాకుండా మరేంటి..?

ఇవాల్టికీ ఒకటే చెబుతున్నాం. మీరు 175 సీట్లలో పోటీ చేయండి. ప్యాకేజీ స్టార్‌ అంటే క్షమాపణ చెబుతాం. ఛాలెంజ్‌ చేస్తున్నాను.. 2024లో 175 స్థానాల్లో మీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ను పోటీకి పెట్టండి.. ప్యాకేజీ స్టార్‌ అనే మాటను వెనక్కి తీసుకుంటాం. 2024లో తెలుగుదేశంలో అంటకాగను.. చంద్రబాబు సంకకింద దూరను, చంద్రబాబు కాళ్ల నొక్కను, బూట్లు నాకను అని చెబితే ఆ మాటను వెనక్కు తీసుకుంటాం. 

దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి.. బంతి, చామంతి, సోదర.. ఏరా నా కొడకా నీకు నాకు చుట్టరికం ఏంట్రా అని దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి మాట్లాడుతున్నాడు. సోదరా అంటేనే.. అంత కడుపురగిలితే, వైయస్‌ఆర్‌ సీపీలోని కాపు ఎమ్మెల్యేలందరినీ నా కొడకల్లారా అంటే నీ బలుపు ఏంట్రా.. మాకెంత కోపం రావాలి. సిగ్గు,శరం వదిలేసి మాట్లాడుతున్నాడు. 

కొంపల్లి సుందరం, పూలే పుస్తకం అని చూపిస్తూ ఆ బూతులన్నీ ఆ పుస్తకాల్లో చదివావా..? రాంమనోహర్‌ పుస్తకం క్యాస్టిజం అనే పుస్తకం చలంగారు ఇచ్చారంట. చలంగారు 1979లో చనిపోయారు. పుస్తకం ఇచ్చిన చలం ఎవరో మాకు తెలియదు. బూతులన్నీ ఆ పుస్తకాల్లోనే ఉన్నాయా..? మా పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరూ ఆ పుస్తకాలేనా చదవాల్సింది.. శుంఠన్నర శుంఠ. 

రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా..? ప్రజలు ఉంటారా..? సామాజిక సేవ చేయడానికి వచ్చిన ప్రజానాయకుడికి కులం ఉంటుందా..? సన్నాసిన్నర సన్నాసి దుగ్ద, బాధ అంతా సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐదుగురు మంత్రులు కాపులు ఉన్నారు. విధానపరమైన నిర్ణయాలన్నింటిలో కాపులకు అత్యధిక ప్రాధాన్యత కాపులకు లభిస్తోంది. కాబట్టి కాపులను ఎంత రెచ్చగొట్టినా ఒక్కరు కూడా టీడీపీ వైపు తిరగడం లేదు.. వైయస్‌ఆర్‌ సీపీవైపే మెజార్టీతో ఉన్నారని దుగ్ద, బాధతో మాట్లాడుతున్నాడు. కాపులు అత్యధిక శాతం సీఎం వైయస్‌ జగన్‌ వెంట, వైయస్‌ఆర్‌ సీపీ వెంట ఉన్నారు. 2019 ఎన్నికల్లో అండగా ఉన్నారు. 2024 ఎన్నికల్లోనూ ఉంటారు. 

కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడుతాడు. కులం లేదని మాట్లాడుతాడు. నాకు కులం లేదు, మతం లేదని చెప్పిన శుంఠన్నర శుంఠ ఎవరు..? వంగవీటి రంగా గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను హీనాతిహీనంగా చెప్పరాని భాషతో తిట్టారని పద్మనాభం ఆవేదన చెందారు. రంగా గురించి తరువాత.. ముద్రగడ పద్మనాభంను వేధించినప్పుడు నీదే కదా ప్రభుత్వం.. నోరు పడిపోయిందా.. గొంతుకు పక్షవాతం వచ్చిందా..? సన్నాసిన్నర సన్నాసి.. నా కొడకా, నాలుక చీరేస్తా.. అని మేము అనలేమా..? సంస్కారం ఉంది కాబట్టి అలా మాట్లాడటం లేదు. 

నీ కంటే బూతులు ఎక్కువగా వచ్చు. తిట్టగలను కానీ, సంస్కారం అడ్డువస్తుంది. మా పార్టీలో నాటుగా మాట్లాడేవారిని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అర టికెట్‌లు, అమాయకమైన పిల్లలను, ఓటులేని పిల్లలను పది నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఈలలు, చప్పుట్లు కొట్టించుకొని, బూతులు తిడితే పండగ అయిపోద్దా..? 

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడిని బోసడీకే అని పార్టీ ఆఫీస్‌ నుంచి బూతులు తిట్టించినప్పుడు నోరు పడిపోయిందా..? 

నీ పెళ్లీళ్ల గురించి ఎవరికి అవసరం.. అరేయ్‌ సన్నాసిన్నర సన్నాసి..నాకు కుదురలేదు, మీరు కూడా చేసుకోండి అన్నావు కాబట్టే మాట్లాడుతున్నారు. నాకు కుదర్లేదు అంటే ఎవరూ మాట్లాడరు. స్తీ్రకి విలువ ఇచ్చే మర్యాద ఇదేనా..? ఒకరికి రూ.5 కోట్లు, మరొకరికి ఆస్తి మొత్తం ఇచ్చి సెటిల్‌మెంట్‌. నీ కార్లతో ఎవరికి ఏం అవసరం..? నీ పార్టీ వాళ్లు వందల మంది కామెంట్స్‌ చేస్తున్నారు.. మా పార్టీ  నుంచి కూడా మాట్లాడుతారు. నాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కార్ల ఈఎంఐలకు డబ్బులు లేవని వాగింది మరిచిపోతే ఎలా..? నువ్వు కార్లు కొనుక్కుంటావో.. ఎడ్లబండ్లు కొనుక్కుంటావో, విమానాలు కొనుక్కుంటావో మాకెందుకు..? ఎలాగైనా ఊరేగూ మా పార్టీకేంటి..? 

వైయస్‌ఆర్‌ సీపీ వాళ్లు ఒక పెళ్లి చేసుకొని, 30 మంది స్టెపినీలతో తిరుగుతారని పవన్‌ మాట్లాడుతున్నాడు.. మొత్తం 30 మందిని నువ్వే పంపించావా..? స్టెపినీల సప్లయ్‌ కంపెనీనా నీది..? 30 మంది అని లెక్క ఎట్లా తెలిసింది.. నీది సప్లయ్‌ కంపెనీనా..? లోపల దురుద్దేశం పెట్టుకొని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. 

ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పుకునే అధ్యక్షుడు ఇంత నిర్లజ్జగా, ఇంత పచ్చిగా మాట్లాడే వాడు భారతదేశ చరిత్రలో ఎవరూలేరు.. మొట్టమొదటివాడు పవన్‌. పార్టీ అధ్యక్షుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని సిగ్గు  విడిచి అసభ్యపదజాలంతో చెలరేగిపోయిన వాడు పవన్‌ తప్పితే ఇంకెవ్వడూ రాడు, రాబోడు. రాజకీయాల్లోకి వచ్చింది రౌడీయిజం, గూండాయిజం చేయడానికి వచ్చావా..? కొట్టుకోవడానికి రావాలా..? నీకు అంత సరదాగా ఉంటే వచ్చేవారు వచ్చి నీ తోలు తీస్తారు. 

ఎవడ్రా నీ కొడుకులు.. అరేయ్‌ సన్నాసిన్నర సన్నాసి.. పౌరుషం గల 16 అణాల కాపు బిడ్డను నేను. కల్తీగిల్తీ జాంథానయ్‌. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తే ఊడిగం చేసినట్టా..? మరి నీ పక్కన నాదెండ్ల మనోహర్‌ ఏం చేస్తున్నాడు. నీ కాళ్లు ఒత్తుతున్నాడా..? ఇంకేమైనా పిసుకుతున్నాడా..? ఒళ్లుపడుతున్నాడా..? 

నీలాంటి వాడితో రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుగాఉంది. చంద్రబాబు కోసం ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ పట్ల కాపులు ప్రేమతో ఉన్నారని, వైయస్‌ఆర్‌ సీపీకి, కాపు కులానికి తగాదా పెట్టి తద్వారా కాపులందరినీ చంద్రబాబుకు అప్పగించడానికి తప్పితే మరేంటి నీ ప్రయత్నం. 

ఎన్నికల సమయానికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి పనిచేస్తారు. కొద్ది సీట్లకు మాత్రమే పవన్‌ పరిమితం అవుతాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తాడు. ముందు నుంచి ఇదే చెబుతున్నాం. అవి వాస్తవాలు అయి తీరుతున్నాయి. 

మీరంతా హాకీ స్టిక్స్, బ్యాట్లు పట్టుకొని బజార్‌కు వచ్చి విధ్వంసం సృష్టించండి అని చెబుతున్నాడు. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు యువతకు ఇచ్చే సందేశం ఇదేనా..? యువతను పెడదారి పట్టించడం, రాజకీయ అవసరాల కోసం దిగజారి ఇంత హేయంగా ప్రవర్తించడం దేశంలో మనం చూడలేం. 

నీకు ఒక కాలుకే చెప్పు ఉందేమో? మాకు రెండు చెప్పులున్నాయి. టీవీ ఛానళ్ల ముందు చెప్పు తీసి, సినిమా డైలాగ్‌లు చెబితే, నా కొడుకుల్లారా అని అంటే నీ నోటి దూల తీరుతుందేమో కానీ, రాజకీయంగా సీఎం వైయ‌స్ జగన్‌ను ఈక కూడా పీకలేవు. అది 2024 ఎన్నికల్లో నీకు అర్ధం అవుతుంది సన్నాసిన్నర సన్నాసి.

దిగజారి నీకన్నా అసహ్యంగా తిట్టే సమర్థత, సత్తా, భావజాలం నాకుంది. కానీ నా తల్లి ఇచ్చిన సంస్కారం అడ్డు వస్తుంది. ఇంతకు మించి నిన్ను అసభ్య పదజాలం వాడను. అవి కూడా నువ్వు మాట్లాడావు కాబట్టి.. నేనూ మాట్లాడాల్సి వచ్చింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌లో ఉన్న కాపు నాయకులు కూడా బూతులు తిట్టగలరని చెప్పడం కోసమే అలా మాట్లాడాను సన్నాసిన్నర సన్నాసి.

ఒక వంద, రెండొందల మందిని పోగేసి వారికి కర్రలు ఇచ్చి, మంత్రుల మీద దాడి చేస్తే, నీ తాటాకు చప్పుళ్లకు వైయస్సార్‌సీపీ ఏ మాత్రం భయపడదు. ఈ సన్నాసిన్నర సన్నాసి ఉడత ఊపులకు మేము భయపడం. నువ్వు నోరు జాడిస్తే సన్నాసిన్నర సన్నాసి.. ఇక్కడ కూడా 100 నోళ్లు జారుతాయని హెచ్చరిస్తున్నా.

చంద్రబాబు, సన్నాసిన్నర సన్నాసి.. ఇద్దరూ కుట్ర చేసి, గర్జన ర్యాలీ రోజు కావాలనే విశాఖలో కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ఎందుకు గొడవ చేయించాడు? ఎయిర్‌పోర్టుకు కర్రలు ఎందుకు తీసుకుపోవాలి?
ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏదో జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. మర్నాడు జనవాణి నిర్వహించుకోమని పోలీసులు కోరితే, అక్కడికి పోలేదు. కావాలనే తన పార్టీ కార్యకర్తలను హోటల్‌ వద్దకు పిలిపించుకుని నానా హంగామా చేశాడు. మంత్రుల మీద దాడి చేస్తే, చంద్రబాబుతో సహా, అన్ని పార్టీల నాయకులు పవన్‌కు ఫోన్‌ చేయడం విచిత్రం. ఇదంతా ఉమ్మడిగా, కలిసి కుట్ర చేసి, ప్లాన్‌ ప్రకారం అక్కడికి పోయారు. మళ్లీ ఇక్కడికి వచ్చి మూడు, నాలుగు గంటలు బూతు పంచాంగం.

బూతుల‌తో మానసిక ఆనందం పొందుతున్న సన్నాసిన్నర సన్నాసికి ఒకటే హెచ్చరిక. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతున్న నువ్వు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేయొద్దు. చంద్రబాబు డైరెక్షన్‌లో, ఆయన కోసమే పవన్ పని చేస్తున్నాడు. సీఎం వైయ‌స్ జగన్‌కి, కాపులకు మధ్య గొడవలు పెట్టి, కాపులను చంద్రబాబుకు దగ్గర చేయడమే పవన్‌ ఉద్దేశం. నా కొడకా ఇంకోసారి ఇలాంటి పదజాలం వాడితే నాలుక చీరుతాం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top