ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలి

‘గడప గడపకు మనప్రభుత్వం’పై నిర్లక్ష్యం వద్దని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

వర్క్‌షాప్‌ ముగిసిన అనంతరం మీడియాతో మాజీ మంత్రి కన్నబాబు

తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్లక్ష్యం వద్దు అని, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు వివరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వంపై వర్క్‌షాప్‌ ముగిసిన అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తిచేయాలని, అదే విధంగా గృహ సారథుల నియామకం కూడా చేపట్టాలని ఆదేశించారన్నారు. కన్వీనర్లు, గృహ సారథులను వ్యవస్థీకృతం చేయాలని సీఎం చెప్పారన్నారు. గృహ సారథుల నియామకం పూర్తిచేసి విస్తృతంగా ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లాలని సూచించారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వంలో తక్కువ రోజులు పాల్గొన్నారని, మార్చి నాటికి కార్యక్రమం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. వచ్చే మార్చిలో వర్క్‌షాపు ఉంటుందని, ఈలోగా వెనుకబడిన వారు వారి పనితీరు మార్చుకోవాలని సూచించారని మాజీ మంత్రి కన్నబాబు వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top