చంద్ర‌బాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటా..

బాబుకు మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స‌వాల్‌

రెండెకరాల నుంచి వేల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించాడు..?

చంద్రబాబు పక్కన కమ్మవారు తప్ప వేరొకరు ఉండకూడదా..?

గుడివాడలో చంద్రబాబు పెట్టింది కమ్మవారి మీటింగే

గుడివాడ మీటింగులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఏమయ్యారు..?

కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్‌ ఎట్టిపరిస్థితుల్లో గెలవలేరు

ఎన్ని మహా కూటములు పెట్టుకున్నా.. 2024లోనూ హిస్టరీ రిపీట్‌

సీఎం వైయ‌స్ జగన్‌ ప్రభంజనం ముందు అంతా కొట్టుకుపోతారు

గుడివాడ‌: గుడివాడలో పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం భూమి కొన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని బ‌హిరంగ స‌వాల్ విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గుడివాడకు ఫ్లై ఓవర్‌ ఎందుకు వేయించలేకపోయాడు..? గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నావా..? గుడివాడను చంద్రబాబు గాలికొదిలేశాడని మండిప‌డ్డారు. గుడివాడ‌లో కొడాలి నాని విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.16 కోట్లతో సైడ్‌ కాల్వలతో కలిపి రోడ్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్ల స్థలాల కోసం సీఎం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారని గుర్తుచేశారు. గుడివాడకు మంచినీటి సదుపాయం కల్పించింది దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని తెలిపారు. గుడివాడ‌లోని మూడు మండలాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి రూ.130 కోట్లతో టెండర్లు సిద్ధం చేశామ‌ని, రూ.23 కోట్లతో బస్టాండ్‌ నిర్మిస్తున్నాం, రూ.15 కోట్లతో ఆసుపత్రి ప్రారంభించనున్నాం, మే నెలలో సీఎం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తారని కొడాలి నాని చెప్పారు.  టీడీపీ అధికారంలో ఉండ‌గా బందరు పోర్టును చంద్రబాబు రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు అప్పగించాడని గుర్తుచేశారు. 
 
కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే.. 
కనీసం నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు పెట్టలేకపోయాడు. నిమ్మకూరులో నేను, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం. అలాంటి వ్యక్తి నిమ్మకూరు వచ్చి, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే, శత జయంతి ఉత్సవాలు జరుపుతానంటుంటే.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.  నందమూరి హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు రూ.14 కోట్లతో నిమ్మకూరును అభివృద్ధి చేశాడు. ఎన్టీఆర్  జన్మస్థలమైన నిమ్మకూరు మీద ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తులు కేవలం హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మాత్రమే. 42 ఏళ్ల తర్వాత, అత్తారింటికి నిమ్మకూరు వచ్చి చంద్రబాబు బస్సులో నిద్రించాల్సి వచ్చింది. చంద్రబాబు నిద్రించడానికి నిమ్మకూరులో ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు 

కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్‌..?
తన భార్య ఆస్తులను చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు. అఫిడవిట్ ప్రకారం.. భార్య ఆస్తులతో కలిపి చంద్రబాబు ఆస్తి విలువ రూ.668 కోట్లు. రెండెకరాల నుంచి చంద్రబాబు ఆస్తి రూ.668 కోట్లకు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలి.  క్రిస్టియన్లపై విమర్శలు చేసిన చంద్రబాబు సిగ్గులేకుండా పాస్టర్లతో ఎలా మీటింగ్‌ పెట్టావ్‌..? చంద్రబాబు తన అవసరానికి ఎవడి బూట్లు అయినా నాకుతాడు.

పక్కన కమ్మవారు తప్ప వేరొకరు ఉండకూడదా..?
గుడివాడలో రాత్రి మేకప్‌ వేసుకోవడానికి చంద్రబాబు.. మూడుచోట్ల బస్సు ఆపాడు. అనేక మతాలు, కులాల సమ్మేళనం గుడివాడ. చంద్రబాబు బస్సుమీద ఉన్న ఆ నలుగురూ కమ్మోళ్లే. అది కమ్మవాళ్ళ కుల మీటింగ్ అవుతుంది తప్పితే.. ప్రజల మీటింగ్ ఎలా అవుతుంది. జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఏమైపోయాడు..?..ఆంబోతు అచ్చెన్నాయుడు ఏమయ్యాడు..? చంద్రబాబు పక్కన కమ్మవారు తప్ప మరొకరు ఉండకూడదా..?. అచ్చెన్నకు కొంచెం గట్టి చట్నీ వేసి తీసుకొస్తే వచ్చేవాడు కదా..?  మొన్న గెలిచిన ఎమ్మెల్సీ అనురాధ కూడా ఏమైపోయింది..? గంటన్నరపాటు ఖాళీ కుర్చీలకు సొల్లు కబుర్లు చెప్పాడు చంద్రబాబు.

బాబు ప్రచారం చేసినా ఓటమి తప్పదు..
చంద్రబాబు గుడివాడలో ఎవరికి ప్రచారం చేసినా ఓడిపోవడమే జరుగుతుంది. దేవుడి దయవల్ల చంద్రబాబు నాకు ప్రచారం చేయలేదు కాబట్టే నేను గెలిచాను. రానున్న ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ ఓడిపోవడం ఖాయం . చంద్రబాబు జిత్తుల మారి నక్క..గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు.  దివంగత మ‌హానేత డాక్టర్ వైయ‌స్సార్, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుడివాడలో పేదల ఇళ్ల కోసం భూములు కొన్నారు. టిడ్కో ఇళ్లతో కలిపి 23 వేల మందికి సొంతింటికల నెరవేర్చబోతున్నాం.  

తండ్రీ కొడుకులు ఓటమి తప్పదు..
కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేరు. ఎన్ని మహాకూటములు పెట్టుకున్నా.. 2024లోనూ హిస్టరీ రిపీట్‌ అవుతుంది. మీరంతా సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభంజనం ముందు కొట్టుకుపోతారు. బస్సులోకెళ్లి గంటగంటకు గంజాయి కొట్టొచ్చేది చంద్రబాబే. నాకు చంద్రబాబు రాజకీయ జీవితం ఇస్తే.. చంద్రబాబుకి రాజకీయ జీవితం ఇచ్చిందెవరు..?. రాజకీయ జీవితం ఇచ్చిన ఇందిరాగాంధీని, ఎన్టీఆర్ ను ఏం చేశాడో గుర్తులేదా..?

వెయ్యి కోట్ల స్థలంలో అంబేడ్కర్ విగ్రహం
రాజ్యాంగం ప్రదాత డా.బిఆర్‌.అంబేద్కర్‌.. ప్రతీ ఒక్కరూ ఆయన బాటలో నడవాలి. అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. వెయ్యికోట్ల విలువైన స్థలంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. మరో మూడు నెలల్లో విగ్రహం పూర్తిచేసి, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తాం. ఈ దేశంలో అత్యంత ఘనంగా అందరూ జరుపుకునే పండుగ అంబేద్కర్‌ జయంతి. అంబేద్కర్‌ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు. డాక్టర్ అంబేద్కర్‌ వంటి మహనీయుల జయంతి రోజున 420 చంద్రబాబు గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టం` అని కొడాలి నాని అన్నారు. 

Back to Top