స్కామ్‌లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?

ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి సవాల్‌.. 

ప్రకాశం జిల్లా:  ఇళ్ల పట్టాలలో స్కామ్‌లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఇళ్ల పట్టాలలో స్కాం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని  బాలినేని శ్రీనివాసరెడ్డి చాలెంజ్ చేశారు. నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం. బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే  పేదలు క్షమించర‌ని హెచ్చ‌రించారు.  వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా  అని బాలినేని స్పష్టం చేశారు.

Back to Top