పోలీసు  దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

 సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు  తీసుకోవాలి

గుంటూరు: పోలీసు యంత్రాంగం చంద్ర‌బాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లి మాన‌వ  హ‌క్కుల‌ను హ‌రిస్తోంద‌ని, పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం చేస్తుంద‌ని మాజీమంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. శ‌నివారం పార్టీ నేత‌ల‌తో క‌లిసి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని పలు చోట్ల కేసులు పెట్టారని అన్నారు.  సుధారాణి దంపతులతోపాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఈ నెల 4న తీసుకెళ్లి నిన్న జడ్జిముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముందు సుధారాణి జరిగిందంతా చెప్పారు. పోలీసులు కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారు సుధారాణి. ఒక మహిళను ఉగ్రవాదిని  హింసించినట్టు హింసించారు. మహిళను ఐదు రోజులు చిత్ర హింసలు పెట్టారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు  తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తాం.  పోలీస్‌ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. పోలీసు యంత్రాంగం మానవహక్కులు  హరిస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలపై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం చేస్తుంద‌ని అన్నారు. 

Back to Top