కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదు 

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఫైర్‌

గుంటూరు: కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వ‌తం  మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తనకు ఉన్న 22 ఎకరాల పొలంపై సర్వే పేరుతో అధికారులు నోటీసులు జారీ చేశారని చెప్పారు. తన పొలంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ ఉన్నాయని చెబుతున్నారని, కానీ అక్కడ చిన్న బావి, పాడైన పెంకుటిల్లు మాత్రమే ఉన్నాయని, అవి తాను కొనుగోలు చేసే ముందే ఉన్నాయని స్పష్టం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు,  కూటమి ప్రభుత్వం తన కుటుంబంపై దాడులు చేయడంతో పాటు ఇప్పుడు తన ఆస్తులపై కూడా వేధింపులకు పాల్పడుతోందని ధ్వ‌జ‌మెత్తారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తనకు ఉన్న 22 ఎకరాల పొలంపై సర్వే పేరుతో అధికారులు నోటీసులు జారీ చేశారని చెప్పారు. తన పొలంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ ఉన్నాయని తనిఖీలు చేయాలని చెప్పారని, అయితే అక్కడ చిన్న బావి, పాడైన పెంకుటిల్లు మాత్రమే ఉన్నాయని, తాను కొనుగోలు చేసే ముందే అవి ఉన్నాయని స్పష్టం చేశారు. స్విమ్మింగ్ పూల్ లేదని, కేవలం బావి మాత్రమే ఉందని వివరించారు. చంద్రబాబు, లోకేష్ చూస్తాను అంటే రండి.. నా పొలం చూపిస్తా అంటూ స‌వాల్ విసిరారు. తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుతున్నారని ఆక్షేపించారు.

Back to Top