కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

తాడేప‌ల్లి: విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ సత్య కుమార్(PC 226) కుటుంబానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా అంద‌జేసిన‌ట్లు డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 
వీధి నిర్వహణ లో భాగంగా కడప-చెన్నై జాతీయ రహదారి పైన  వే రోడ్డు కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు వస్తున్న APSP కు చెందిన కానిస్టేబుల్ PC 226- సత్య కుమార్(2005 బ్యాచ్,) సొంత ఊరు చెన్నూర్ మండలం. భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు.

కానిస్టేబుల్ సత్య కుమార్(PC 226)  ఘటనను  డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి   ముఖ్యమంత్రికి గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి గారు అమర వీరుడైన APSP కు చెందిన కానిస్టేబుల్ సత్య కుమార్ గారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం నుండి 30 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. 

అందులో భాగంగా ఈ రోజు ఆయన సతీమణి శిరివెళ్ల రాజీ, కుమారుడు సంతోష్ కుమార్ కి 30,00,000లక్షల రూపాయల చెక్ ను అందించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న సత్య కుమార్ కుమారుడు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం కల్పించే విధంగా  G.O జారీ చేయాలని తన కార్యాలయ అధికారులకి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Back to Top