వంద మహానాడులు జరిపినా చంద్రబాబుకు అధికారంలోకి రాడు

  వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అనంత‌పురం:  చంద్ర‌బాబు వంద మ‌హానాడులు నిర్వ‌హించినా అధికారంలోకి రాలేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వ‌ర‌రెడ్డి అన్నారు. "విడపనకల్లు మండలం ఉండబండలో 'గడప గడపకు మన ప్రభుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ నిర్వహించిన మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా చంద్రబాబు అండ్ కో పెట్టుకున్నారని, ఎక్కడ ఆత్మవిమర్శ అనేది లేకుండా పరనిందకే సాగిందని  విమర్శించారు. మూడేళ్ల వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేసిన మేలును విశ్వేశ్వరరెడ్డి గడప గడపలో వివరించారు. వారి దృష్టి కి వచ్చిన సమస్యలను పరిష్కారించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.  సీఎం వైయ‌స్ జగన్‌ పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఇన్ని హామీలు నెరవేర్చలేదని తెలిపారు. ఇక ఒంగోలు లో నిర్వహించిన మహానాడు కాదని.. అది మోసపునాడుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు మరో వంద మహానాడులు చేసినా మళ్లీ అధికారంలోకి  రావడం కలే అని అన్నారు. క్విట్ జగన్ అని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.95 శాతం హామీలు అమలు చేసి ప్రజలకు మేలు చేసినందుకు క్విట్ చేయాలా అని ప్రశ్నించారు.  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు దాదాపు క్విట్ చేసారని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో క్విట్ చేస్తారని చెప్పారు.చంద్రబాబు, లోకేష్ లు రాబోయే రోజుల్లో హైదరాబాద్ కే పరిమితం కాక తప్పదని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, మండల కన్వీనర్ బసన్న, యువనేత భరత్ రెడ్డి, జెడ్పిటిసి హనుమంతు, విడపనకల్లు ఎఫ్ఏసీఎస్ చైర్మన్ శ్రీరాములు, నెరిమెట్ల సర్పంచ్ యోగేంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, ఉరవకొండ వైస్ ఎంపీపీ నరసింహులు, వ్యాసాపురం ఉలిగప్ప, ఉండబండ నాయకులు ప్రకాష్ గౌడ్, రాజన్న గౌడ్, తిప్పయ్య, ఓబులప్ప, ఎంఎల్ఓ కుల్లాయి స్వామి, ఎంపిడిఓ శ్రీనివాస్, ఆర్ ఐ అశ్వర్థ్ నారాయణ, ఏవో మధుమతి, ఏపీఎం ఆంజనేయులు, ఏఈ సత్యం, సెక్రెటరీ శైలజ, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు,చీకులగురికి నాయకులు మహేష్, మహానంది, శ్రీనివాస్, సురేష్, హనుమంతు, వైయ‌స్సార్సీపీ పాల్గొన్నారు.

Back to Top