వైయ‌స్ జగన్ తోనే సామాజిక న్యాయం 

"సామాజిక న్యాయ భేరి" సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 
 

అనంత‌పురం:  సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని ఉరవకొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం విడపనకల్లు మండలం ఉండబండ వీరభద్రస్వామి ఆలయం వద్ద వైయ‌స్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 29న అనంతపురంలో జరిగే 'సామాజిక న్యాయ భేరి' సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ చేయని విదంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సామాజిక న్యాయ జయభేరి పేరిట మంత్రులు చేస్తున్న బస్సుయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో జరిగిన సామాజిక న్యాయం.. ఇప్పుడు మూడేళ్లుగా వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం మహా విప్లవంలా సాగుతోందని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బలహీనవర్గాలకే వైయ‌స్ జగన్‌ ఇచ్చారన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. వీరశైవ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివానంద,జెడ్పిటిసి హనుమంతు, నాయకులు సిపి వీరన్న, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, కన్వీనర్ బసన్న, ఆలయ కమిటీ చైర్మన్ బసవరాజు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుశీలమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు,గోపాల కృష్ణ, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, హనుమంత రెడ్డి,రాజశేఖర్, అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top