లోకేష్‌ను సంస్కారం లేని వ్యక్తిగా మార్చి జనం మీదకి వదిలాడు 

వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జగన్‌ల‌ పాదయాత్ర వీడియోలు చూస్తే తెలుస్తుంది

సూర్యుడు అస్తమించాక లోకేష్‌ యాత్ర ప్రారంభం అవుతుంది

వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశువుల డాక్టరే

లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు అవసరం లేదా?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్నా క్యాంటీన్లు పెట్టారో లెక్క చెప్పగలరా?  

మచిలీపట్నంలో పోర్టు నిర్మాణాన్ని టీడీపీ ఎలా అడ్డుకున్నదో ఆధారాలతో సహా లోకేష్‌తో చర్చించటానికి నేను సిద్దం

లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? 

 తాడేప‌ల్లి: లోకేష్‌ను సంస్కారం లేని వ్యక్తిగా మార్చి చంద్రబాబు జనం మీదకి వదిలాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు. సూర్యుడు అస్తమించాక లోకేష్‌ యాత్ర ప్రారంభం అవుతుందని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ ఎవరితో మాట్లాడతారు? ఏం చర్చిస్తారు?. పాదయాత్ర పగటిపూట చేస్తే జనం ఛీ కొడతారని, జనం నిద్ర పోయాక అర్ధరాత్రి చేస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి జనాన్ని రప్పించుకుంటున్నార‌ని మండిపడ్డారు.  బుధ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

మిడ్ నైట్ యాత్రః
 మాజీ ముఖ్యమంత్రి, నలభై ఏళ్ల పొటిటికల్‌ ఇండస్ట్రీ చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్‌- యువగళం పేరిట యువగంగాళం యాత్ర చే స్తున్నాడు. సూర్యుడు అస్తమించే సమయానికి పాదయాత్ర ప్రారంభిస్తాడు. అర్ధరాత్రి నడిచేదానికి యువగళం అని నామకరణం చేసుకున్నాడు. అసలు, నీ వయసెంత..? నువ్వు నడిచే పాదయాత్ర తీరేంటి..? సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 3 గంటలకు ముగించేదాన్ని పాదయాత్ర అంటారా..? మిడ్ నైట్ యాత్ర అంటారా..? పగటిపూట పాదయాత్ర చేస్తే .. నువ్వూ నీ డాడీ నిర్వాకం ఏంటని ప్రజలు నిలదీస్తారని .. ఆనాటి మీ పాలనను ఛీ కొడతారనే భయంతోనే రాత్రి తిరుగుతున్నాడేమో.. ఏదిఏమైనా, ఈ లోకేశం యాత్ర పుణ్యమాని అక్కడక్కడ పేదోళ్లకు రోజుకి రూ. వెయ్యి గిట్టుబాటవుతుంది. 

బూతుల సభకు రూ. 20 కోట్లా..?ః
కృష్ణాజిల్లాలో యాత్ర పేరుతో బెజవాడలో నాలుగైదు వీధులు తిరిగాడు. కన్నుమూసి తెరవగానే గన్నవరం చేరుకున్నాడు. అక్కడ ఒక రూ.పదో ఇరవై కోట్లో ఖర్చు పెట్టి కుర్చీలేసి బహిరంగ సభ పెట్టాడు. ఆ సభ ఎందుకయ్యా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్ని బూతులు తిట్టడానికంట. బాబు సంస్కారహీనంగా పెంచి బజారులో తోలితే సంస్కారం లేని వ్యక్తిగా తయారయ్యాడు ఈ లోకేశం. మైకు పట్టుకోగానే ఏ మాట్లాడుతున్నాడో కూడా వళ్లు తెలియకుండా ఉన్నాడు.  అది ఈయన పాదయాత్ర. అసలు, రాజకీయాల్లో పాదయాత్ర గురించి ఏమీ తెలియకపోతే.. మహానేత డాక్టర్‌ శ్రీ వైఎస్‌ఆర్‌ గారి పాదయాత్ర వీడియోనో.. లేదంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి పాదయాత్ర వీడియోనో తెప్పించుకుని చూసి నేర్చుకోవచ్చు కదా..? పగలంతా ప్రజలతో మమేకమై నడిచి స్థానికంగా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇబ్బందులును తెలుసుకుని.. వాటిని ఎలా పరిష్కరించాల్నో అవగాహన చేసుకోవడాన్ని అసలైన పాదయాత్ర అంటారు. రెండుమూడ్రోజులుకు ఒక విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అంతకుముందు తాను చూసిన, విన్నటువంటి సమస్యల్ని ఏవిధంగా పరిష్కరించదలిచావో ప్రజలకు వివరించేందుకు సభ పెట్టుకుంటారు. లోకేష్ లా, ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని, ప్రభుత్వాన్ని బూతులు తిట్టడానికి అడుగడుగునా సభలు పెట్టుకుని డబ్బాలు కొట్టుకోరు.. అని గుర్తు చేస్తున్నాను.  

తెలుగు బూతుల పార్టీః
- సంస్కారం లేని వ్యక్తులతో, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడే వారితో టీడీపీ నిండిపోయింది. తెలుగుదేశంపార్టీ కాస్తా తెలుగు బూతుల పార్టీగా మారింది. ప్రజల సమస్యలు వినరు. వాటిని అవగతం చేసుకోరు. ఎంత సేపటికీ, అధికారంలో ఉన్నోళ్లను బూతులు తిట్టి.. మనం అధికారపగ్గాలు పట్టుకోవాలనే ఆరాటమే టీడీపీ అజెండాగా మారింది. నిన్నటి గన్నవరం సభలో లోకేశ్‌ దగ్గర్నుంచి ఆపార్టీలో ఉన్న అవుట్‌డేటెడ్‌ నాయకులంతా బూతుల్నే మాట్లాడారు తప్ప ప్రజల సమస్యలు, వారి అవసరాలు, రాష్ట్ర శ్రేయస్సుపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

సంస్కారహీనులు వీళ్లుః
అయితే, ఈరోజు చంద్రబాబు, లోకేశ్‌ తీరును అందరూ చూస్తున్నారు. నలుగురు చంచాగిరి గాళ్లను పక్కనబెట్టుకుని నానారకాల దుర్భాషలాడటం.. అసభ్యకర బూతులు తిట్టడం, వ్యక్తిగత దూషణలు చేయడం .. ఇలాంటి వారి ప్రవర్తనను ప్రజలు చీదరించుకుంటున్నారు. టీడీపీలో వయసుమళ్లిన నేతలు కూడా వళ్లు తెలియకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ‘వాడు.. వీడు.. నా కొడుకు..’ అంటూ నోరుపారేసుకోవడం ప్రజలు చూస్తున్నారు. డెభ్భై - ఎనభై ఏళ్లు వచ్చిన ముసలోళ్లు కూడా బూతులు తిడుతూ.. పైశాచికత్వం పొందుతున్నారంటే.. చనిపోయిన పైకెళ్లిన మీ అమ్మానాన్నల ఆత్మలు తీవ్రంగా క్షోభిస్తాయని తెలుసుకోవాలని గుర్తుచేస్తున్నాను. 

బూతులే భవిష్యత్తుకు మీరిచ్చే భరోసానా..?ః
 టీడీపీ నేతలు, ఆపార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశం మాట్లాడుతున్న ట్రెండింగ్‌ అబద్ధమేమంటే.. భవిష్యత్తుకు భరోసా ఇస్తారంట. వారు మాట్లాడే బూతులే భవిష్యత్తుకు భరోసా అంటున్నారు. నిన్నటిదాకా మా నాన్న చాలా అబద్ధాలు చెప్పాడు. నేను మా నాన్నలా కాకుండా అంతకుమించి అబద్ధాలు ఆడతానంటూ.. టీడీపీ మ్యానిఫెస్టోలోని అబద్ధాల్ని పదేపదే వివరిస్తున్నాడు. అవేంటని చూస్తే.. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తమ పార్టీ అధికారంలోకొస్తే అమలు చేస్తాం.. అంటూ గొప్పగా చెప్పుకుంటు న్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు, అమలు చేయని వాటినే మరోమారు అమలు చేస్తామని చెప్పుకోలేని చరిత్రహీనులు ఈ అబ్బాకొడుకులు. ఎందుకంటే, అప్పటి టీడీపీ మ్యానిఫెస్టోలో 650 హామీల్ని ఎగొట్టి ప్రజలకు మొండిచెయ్యిచ్చిన వాళ్లు వీరే కదా..? అందుకే, ఇప్పుడు జగన్‌గారు పేదలకు అందించే పథకాల్నే.. తామూ అందిస్తామని మరోమారు అబద్దాల అజెండా చెబుతున్నారు. ఇచ్చే వాడ్ని కాదని.. ఇస్తానన్నోడ్ని ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నారో టీడీపీ నేతలకే తెలియాలి.    

తండ్రి గురించి చెప్పుకోలేని దౌర్భాగ్యుడు లోకేష్
ప్రజలకు ఏం మేలు చేస్తాడో చెప్పడు. కానీ, మా నాన్న చాలా మంచోడు. నేను మాత్రం మూర్ఖుడ్ని .. నేను చాలా చెడ్డోడ్ని.. గుడ్డలూడదీస్తా.. కోసి కారం పెడతా.. జైల్లో వేస్తా.. కట్‌డ్రాయర్‌తో నడిపిస్తా.. తాటతీస్తా.. ఎర్రడైరీలో రాస్తా.. అంటాడు. ఇది అబ్బాకొడుకులైన చంద్రబాబు, లోకేశ్‌ ప్రజలకు వివరిస్తున్న మ్యానిఫెస్టో. అంటే, ప్రజలు మూర్ఖుడికి అధికారం ఇవ్వాలని ఈ లోకేశం మాలోకం కోరుకుంటున్నాడు. చిన్నవయసులో నైతికతతో కూడిన రాజకీయాలను తెలుసుకోవాల్సిన వ్యక్తి.. ఏమాత్రం సిగ్గులేకుండా ప్రజల ముందు బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. కనీసం, తండ్రి తరఫున కుటుంబం గురించి మాట్లాడుకోలేని వ్యక్తి ఈ లోకేశం. మా తాత ఎన్టీఆర్‌ అంటాడు గానీ.. చంద్రబాబు తండ్రి, ఆయన తండ్రి గురించి చెప్పుకోలేని దౌర్భాగ్యులు వీళ్లు. పోనీ, ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం, రాజకీయ అనుభవం చూసైనా లోకేశం నేర్చుకోవాలి గదా..? ఇలాంటి వ్యక్తులు వచ్చి ప్రజల ముందు నిలబడి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని విమర్శించి బూతులు తిడతారా..? అదేమంటే, నేను మూర్ఖుడ్ని.. నాకు అధికారమివ్వడని ప్రజల్ని కోరుకుంటాడా..? ప్రజలంతా పిచ్చోళ్లు అని బాబు, లోకేశ్‌లు అనుకుంటున్నారు. 

టీడీపీలో ఉన్నప్పుడూ వంశీ  పశువుల డాక్టరే కదా..
మాటకొస్తే టీడీపీలో ప్రతోడూ వల్లభనేని వంశీని పట్టుకుని పశువుల డాక్టర్‌ అంటాడు. ఆయనేమన్నా వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరి జగన్‌గారి కాలేజీలో పశువుల డాక్టర్‌ కోర్సు చేసి బయటకొచ్చారా..? ఈరోజు కొత్తగా ఆయనేమీ పశువుల డాక్టర్‌ కాలేదే..? 2014, 2019లో టీడీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యేగా, 2009లో విజయవాడ ఎంపీగా పోటీచేసినప్పుడు వంశీ పశువుల డాక్టరే.. మరి, ఆ పశువుల డాక్టర్‌కే ఓటేయమ్మని టీడీపీ నేతలు ఆరోజు అడుక్కున్నారు. ఆ పశువుల డాక్టర్‌కే ఆరోజు విజయవాడ టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. మరి, ఆయన అప్పుడేమో మనుషుల డాక్టర్‌.. ఇప్పుడేమో పశువుల డాక్టరయ్యాడా..? వంశీగారిని అలా మాట్లాడటానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలి. 

నానిని చూస్తే.. బాబు ప్యాంట్‌ ఎందుకు తడిసిపోతుంది..?ః
కొడాలి నాని గారిని పట్టుకుని ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారు. 2004, 2009లో ఆయనకు ఎమ్మెల్యేగా టీడీపీ టిక్కెట్‌ ఇచ్చినప్పుడు నాని ఎవరు..? ఏ పని చేసేవారని మీరిచ్చారు..? అప్పట్లో ఆయనేమైనా ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరా ఏంటి..? మీతో ఉండి మీ పార్టీలో ఉన్నప్పుడు మనుషులు ఇంద్రులు, చంద్రులా..? మరి, మీతో సరిపడక, మీ పాపాల్ని భరించలేక పార్టీ నుంచి బయటకొస్తే మాత్రం ఆ మనిషి లారీ క్లీనర్, కప్పులు కడిగేవాడవుతాడా..? మరి, ఆ కప్పులు కడిగేవాడ్ని చూస్తే చంద్రబాబుకు ప్యాంట్‌ ఎందుకు తడిచిపోతుంది. అసలు, కప్పులు కడిగితే తప్పా..? ఓట్లు అడుక్కునేటప్పుడు అదే కప్పులు కడిగేవాడి భుజాలపై చేతులేసి తిరుగుతారా..? గతంలో ఆ కప్పులు కడిగేవాడి కాళ్లు చంద్రబాబు ఎందుకు పట్టుకున్నాడు..? టీడీపీ అనేది ఒక తప్పుడు పార్టీ. అందులో ఉన్నోళ్లు తప్పుడు నాయకులు కనుకనే తప్పుడు బుద్ధులతో మాట్లాడుతున్నారు. 

గుడివాడలో పోటీచేసి గెలిచే దమ్ముందా..?ః
గుడివాడలో కొడాలి నాని గారిని పట్టుకుని లోకేశ్‌ పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు. ఈ బాబుకొడుకులకు నేనొక ఛాలెంజ్‌ చేస్తున్నాను. మీకు ఆవగింజంత సిగ్గు.. దోసగింజంత ఆత్మాభిమానం ఉంటే 2019 నుంచి ఇప్పటిదాకా గుడివాడలో టీడీపీ క్యాండెట్‌ ఎవరో చెప్పండి. అసలు, కొడాలి నాని గారికి వ్యతిరేకంగా ఒక క్యాండెట్‌ మీ పార్టీ తరఫున ఉంటే చెప్పండి. దమ్ముంటే నాని గారికి పోటీగా ఒకరిని నిలబెట్టి టీడీపీ తరఫున గెలిపించుకోగలరా..?నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను. అంతటి సిగ్గుమాలిన నేతలు మీరు, ఈరోజు నాని గారిని విమర్శించే స్థాయినా మీది..? అని అడుగుతున్నాను. ఎన్టీఆర్‌ మనవడ్ని అని చెప్పుకుంటున్న లోకేశ్‌ను సవాల్‌ చేస్తున్నాను. దమ్మూధైర్యముంటే గుడివాడలో పోటీచేసి నాని గారిపై గెలవమనండి. చివరికి గన్నవరంలో కూడా పార్టీ ఇన్‌ఛార్జి లేకపోతే.. వైఎస్‌ఆర్‌సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఓడిన వ్యక్తిని తీసుకెళ్లి గన్నవరం ఇంచార్జిగా పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితి టీడీపీది. 

లోకేశ్‌ శుంఠన్నర కాబట్టే బాబుకు ఏడుపుః
14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈరోజు తన కొడుకు శుంఠన్నర కాబట్టే.. సినిమాహీరోను పట్టుకుని ఏడుస్తున్నాడు. నాడు ఎన్టీరామారావును వెనుక నుంచి కసక్కుమని వెన్నుపోటు పొడిచి దొంగతనంగా పార్టీని లాకున్న వ్యక్తి ఇవాల్టికి ఇలా ఏడవడమంటే.. ఎంత దౌర్భాగ్యమో అని విశ్లేషకులు సైతం విశ్లేషించాలి. చంద్రబాబు సుపుత్రుడే సమర్ధుడైతే ఈరోజు బాబుకు ఇంత ఖర్మ పట్టేది కాదని విశ్లేషించుకోవాలి. సొంత కొడుకును కాదని ఇంకొకడి మీద, దత్తపుత్రుడి మీద  ఆధారపడి రాజకీయాలు చేయాలని ఎదురుచూసే పరిస్థితి చంద్రబాబుది. 
 
మానసిక రోగులుగా చంద్రబాబు, లోకేశ్ః
గుడ్డలూడదీస్తాం.. అండర్‌వేర్‌ తీస్తాం అనే మాటలతో అబ్బకొడుకులు తమ విచిత్ర ప్రవర్తనను బయట పెట్టుకుంటున్నారంటే ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్లు అనుకోవాలి. అందుకే, వాళ్లు పర్యటనల పేరుతో రోజుకొకరి గుడ్డలూడదీస్తామని ప్రజలకు చెబుతున్నారు. లోకేశ్‌ను చూస్తే ఆయన పార్టీ కార్యకర్తలే భయపడటంలేదు. ఆయనేమో మా నాయకుడు జగన్‌గారిని భయపెడతాడంట. చివరికి, అబ్బాకొడుకులిద్దరూ తమను చూసి ఎవరో భయపడుతున్నారనే భ్రమల్లో బతుకుతూ, అదోరకమైన మానసిక రుగ్మతతో తృప్తిపడుతున్నారు. నలభైఏళ్ల యువకుడైన జగన్‌గారు వీళ్ల నడ్డివిరుస్తుంటే.. ఆయన ధాటికి తట్టుకోలేక మతిభ్రమించి పిచ్చెక్కి రోడ్లమీదకొచ్చి నోరుపారేసుకుంటున్నా రు. 2014లో రాష్ట్రాన్ని పాలించినట్లు .. అప్పట్లో అందించిన సంక్షేమ పథకాల్నే రాబోయే కాలంలో అమలు చేస్తామని చెప్పుకోలేని నీచులు చంద్రబాబు, లోకేశ్‌లు. ఈరోజు ప్రజలు ఆదరిస్తున్న జగన్‌గారు ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమపథకాల్నే మేమూ కొనసాగిస్తామని గతిలేక .. విధిలేక చెప్పుకుంటున్న దౌర్భాగ్యులు వీళ్లు. ఇప్పటికైనా ఈ తండ్రీకొడుకులు నోటిని అదుపులో పెట్టుకుని భాష సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని హెచ్చరిస్తున్నాను. 

జగన్‌ గారి సంస్కారాన్ని చూసి నేర్చుకోండిః
మరి, ఆనాడు చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి కుట్రలు చేసి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా మానసికంగా క్షోభ పెట్టారు. మరి, జగన్‌ గారు బయటకు రాగానే సోనియాగాంధీని జైల్లో వేస్తానని చెప్పలేదే.. ఈ చంద్రబాబును జైల్లో తోయిస్తామని అనలేదే.. బాబు కొడుకు లోకేశ్‌ని కోసి కారంపెడతానని మాట్లాడలేదే..? తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాననేది చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్నిరంగాల్ని బాగు చేస్తానని చెప్పారు. ప్రజల మన్ననలు పొందారు. వారి ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఈరోజు అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు తెచ్చి ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఇది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుని వ్యక్తిత్వం తాలూకూ లక్షణం. 

బందురు పోర్టుకు టీడీపీ ఒక్క ఇటుక వేయలేదుః
లోకేశ్‌కు నేను బహిరంగ సవాల్‌ విసురుతున్నాను. నువ్వు ఉన్నచోటికి నేనొస్తాను. బందరు పోర్టుకు ఈ లోకేశ్‌ భూసేకరణ చేయలేదు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు పనులపై చిత్తశుద్ధిగా జగన్‌ గారి ప్రభుత్వం పనిచేస్తుంటే.. ఈ టీడీపీ రాక్షస మూకలు యాగాన్ని భంగం చేసేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 5 దావాలేసి సెప్టెంబర్‌ 2022 వరకు ఎంత కాల్చుకుతిన్నారో ప్రభుత్వానికి, మా బందరు ప్రజలకు తెలుసు. 
- 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం బందరు పోర్టుకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. 2014 ఎన్నికల్లో హామీనిచ్చి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో బందరు పోర్టు కడతామని.. బందరును హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా సాఫ్ట్‌వేర్‌హబ్‌గా మార్చుతామని.. ఆక్వాహబ్‌గా తయారుచేస్తామని చంద్రబాబు, లోకేశ్‌ మాయమాటలు చెప్పారు. 
- అయితే, అదేమీ జరగకపోగా మరోమారు బందరువాసుల్ని మోసం చేయడానికి 2019 మార్చి 7న శంకుస్థాపన పేరుతో రూ.8.60 కోట్లు ఖర్చుపెట్టి మోసం చేశారు వీళ్లు. అదే ముఖ్యమంత్రి జగన్‌గారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొత్తం 2వేల ఎకరాల ప్రభుత్వభూమితోనే రూ.5,200 కోట్లతో ఇవాళ బందరు పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దీనిపై ఆధారాలతో సహా నిరూపించుకోవడానికి నేను సిద్ధం. బందరు పోర్టుపై అబద్ధాలు మాట్లాడే ఈ లోకేశ్‌ను చర్చించేందుకు రావాలని నేను సవాల్‌ విసురుతున్నాను.   

 

తాజా వీడియోలు

Back to Top