తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. శత్రువు ఇంటికి కూడా వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయాలని సూచించినట్లు చెప్పారు. గడప గడపకూ వర్క్‌షాపు అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వ్యతిరేకతను కూడా మీడియానే వండి వాడ్చితే ఎలా..సీఎం వైయస్ జగన్ శత్రువుల ఇంటికి కూడా వెళ్లమని చెబుతున్నారు. అవతలి పార్టీలో బాగా క్రియాశీలంగా ఉన్న ఇంటికి కూడా వెళ్లాలని సీఎం వైయస్ జగన్ చెప్పారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడితే నవ్వుతూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించారన్నారు. సాంకేతిక లోపంతో ఏ పథకమైనా రాలేదంటే దాన్ని స్వీకరించి సరిదిద్దాలని సూచించారన్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా చేయాలని తెలిపినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హత ఉండి ఏ పథకమైనా రాలేదని ఫిర్యాదు వస్తే సరిదిద్దాలని సీఎం వైయస్ జగన్ సూచించారన్నారు. చంద్రబాబు 2019 ఎన్నికల్లో తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడని, ప్రజల స్పందన తెలుసుకోకుండా తనసొంత నిర్ణయంతో వెళ్లి ఒటమి చవిచూశారు. ప్రజల తీర్పును గమనించాలి. ఊహల్లో టీడీపీ నేతలు బతుకుతున్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆలోచన టీడీపీకి లేదు. ఎంతసేపు కొడుకు లోకేష్ నాయకత్వాన్ని బతికించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.