జల్లేరు బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేత 

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. సోమవారం ఉదయం బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం పంచాయితీ తోటపల్లిలో మృతురాలు బుల్లెమ్మ కుటుంబసభ్యులను పరామర్శించి రూ.7.60లక్షల నగదును అందజేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. అలాగే  బస్సు ప్రమాదంలో గాయపడిన తాటి సుబ్బలక్ష్మీ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. సుబ్బలక్ష్మికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.  అదే గ్రామానికి చెందిన మల్లాది నాగమణి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి ఆసుపత్రి అధికారులతో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు.  మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తమకు ఆర్థిక సాయం అందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వీడియోలు

Back to Top