సీఎంను క‌లిసిన బిశ్వ‌జిత్ దాస్‌గుప్తా

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్ చీఫ్, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా (ఏవీఎస్‌ఎమ్, వైఎస్‌ఎమ్, విఎస్‌ఎమ్‌) తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా ఇటీవలే బాధ్య‌త‌లు స్వీకరించారు. ఈ మేర‌కు ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తాని సీఎం స‌న్మానించి.. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ ప్రదీప్‌ సింగ్‌ సేతి, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top