అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం వైయస్ జగన్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని, వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. స్పీకర్ పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమన్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అసహనానికి గురవుతున్నారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పు ప్రకారమే సభలో మాట్లాడే అవకాశం వస్తుందని చెప్పారు. వెనుకబడిన వర్గాలు స్పీకర్ కావడం చంద్రబాబుకు మొదటి నుంచి ఇష్టం లేదన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. స్పీకర్‌కు బేషరత్‌గా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంజాద్‌బాషా డిమాండు చేశారు.