ఎంతకాలం సీఎం వైయ‌స్ జగన్‌ను చూసి ఏడుస్తారు ?

డిప్యూటీ సీఎం పుష్పా శ్రీ‌వాణి  
 

విజ‌య‌న‌గ‌రం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఎంత‌కాలం సీఎం  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చూసి ఏడుస్తార‌ని డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి ప్ర‌శ్నించారు. మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడండి. ప్రజల్లో చులకనైపోవద్దు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఏడవటం వల్ల ప్రయోజనం ఉండడ‌ని, ఎంతకాలం వైయ‌స్‌ జగన్ గారిపై ఈర్ష్యా, ద్వేషాలతో రగిలిపోతార‌ని నిల‌దీశారు. కురుపాం నియోజక వర్గం కొమరాడ మండలం దలాయిపేట పంచాయతీలో రైతుభరోసా కేంద్రం, మాదలింగి పంచాయతీలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం నూతన భవనాలను ఆమె ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా పుష్ప‌శ్రీ‌వాణి మాట్లాడుతూ..  2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ టు సేమ్ రిజల్ట్స్ ప్రజలు ఇస్తున్నార‌న్నారు.  ఏకపక్షంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వానికి పట్టం కడుతున్నారు. ప్రజలు మీకు ఇంతగా గుణపాఠం చెబుతున్నా.. చంద్రబాబు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ నాయకుడు అని అవకాశం ఇస్తే.. రాజధాని ఎక్కడ పెట్టాలంటే.. మన వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ బాగుంటుందో చూసి అక్కడ బెట్టార‌న్నారు.  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో, పదేళ్ళ రాజధాని హక్కును వదులుకుని, ఓటుకు కోట్ల కేసులో కేసిఆర్ చేతికి దొరికిపోయి.. మూటముల్లె సర్దుకుని రాత్రికి రాత్రి చంద్రబాబు ఇక్కడకు వలస వచ్చినట్టుగా పారిపోయి వచ్చాడ‌న్నారు.  సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా, అమరావతి ప్రాంతంలో భూములను తక్కువ రేటుకు కొట్టేసి, తన సొంత మనుషులతో భూములను కొనిపించి అమరావతి రాజధాని అని కథలు చెప్పాడ‌ని విమ‌ర్శించారు.   భగవంతుడు, ప్రజలు సీఎం వైయ‌స్‌ జగన్ గారి వైపు ఉన్నార‌ని చెప్పారు.  

తాజా వీడియోలు

Back to Top