గిరిజనుల కోసం 31 పథకాలు

 డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
 

అమ‌రావతి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం గిరిజనుల కోసం 31 పథకాలను  అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. గురువారం స‌భ‌లో ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం కింద 2,86,379 మందికి గిరిజన మహిళలకు 843,80 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2019-20 నుంచి 2021-22 దాకా 84,478 మంది గిరిజన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 178. 67 కోట్ల రూపాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. గిరిజ‌న ప్రాంతాల్లో ఇంటింటికీ రేష‌న్ డెలివ‌రీ కోసం ప్ర‌త్యేక వాహ‌నాలు ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఆధార్‌కార్డులో వ‌య‌సు తేడాల‌ను స‌రిచేసేందుకు ప్ర‌త్యేక కేంద్రాలు ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు వేస్తామ‌ని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top