క‌రోనా నియంత్ర‌ణ‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రం

మంత్రి ఆళ్ల నాని  

కాకినాడ‌లో కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై మంత్రి స‌మీక్ష‌

తూర్పు గోదావ‌రి: క‌రోనా నియంత్ర‌ణ‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్ల‌నాని కోరారు. కాకినాడ‌లో కోవిడ్ నియంత్ర‌ణ  చ‌ర్య‌ల‌పై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. 20 శాతం ఆక్సిజ‌న్ వృథా అవుతున్న‌ట్లు గుర్తించామ‌న్నారు. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే పైప్‌లైన్‌ను ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.104 కాల్ సెంట‌ర్‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్నామ‌ని ఆళ్ల నాని తెలిపారు.ఆసుప‌త్రుల్లో బెడ్ల సంఖ్య‌ను 3 వేల నుంచి 5 వేల‌కు పెంచుతున్నామ‌ని తెలిపారు. ప్ర‌తి రెవెన్యూ స‌బ్ డివిజ‌న్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి ఆళ్ల నాని  వివ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top