ఎవరికీ ప్రాణపాయం లేదు

గ్యాస్‌ లీక్‌ బాధితులకు ప్రభుత్వమై వైద్య ఖర్చులు భరిస్తుంది

128 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు కూడా వెళ్లారు

సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన పరిహారం త్వరలోనే అందిస్తాం

డిప్యూటî  సీఎం ఆళ్లనాని

విశాఖ:గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వం వైద్యం అందిస్తోందని, ఎవరికీ ప్రాణపాయం లేదని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు పరామర్శించారు. అనంతరం  గ్యాస్‌ లీక్‌ ఘటనపై మంత్రులు, అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బాధితులు త్వరగా కోలుకున్నారన్నారు.ప్రాణనష్టం జరుగకుండా  అన్ని చర్యలు చేపట్టామన్నారు.554 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.వీరిలో 128 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు కూడా వెళ్లారన్నారు.305 మంది కేజీహెచ్‌లో ఉన్నారని, వీరిలో 52 మంది చిన్నారులు ఉన్నారన్నారు.ప్రైవేట్‌ ఆసుపత్రిలో 121 మంది చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ప్రాణపాయం లేదన్నారు. గ్యాస్‌ లీక్‌బాధితులకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు.ప్రతిఇంటి తలుపు తట్టి అధికారులు సహాయక చర్యలు చేపట్టారన్నారు.సీఎం వైయస్‌ జగన్‌ బాధితులకు ప్రకటించిన పరిహారం త్వరలోనే అందిస్తామని ఆళ్లనాని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ కూడా భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వైద్యులు, నిపుణులు చెప్పేవరకు ఎవరూ కూడా ప్రమాద స్థలానికి వెళ్లొద్దని ఆళ్లనాని సూచించారు.
 

Back to Top