టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు మానుకోవాలి

కిశోర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్లనాని

పశ్చిమ  గోదావరి: టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు మానుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. దారుణ హత్యకు గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కిశోర్‌ కుటుంబ సభ్యులను మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే వాసుబాబు పరామర్శించారు.  కిశోర్‌ హత్య కేసులో 9 మందిపై కేసులు నమోదు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు కోరినట్లు చెప్పారు. కిశోర్‌ కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ ఘటనను సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.

Read Also: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

తాజా ఫోటోలు

Back to Top