కాకినాడలో రాజకీయ కక్షలు

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బహిరంగ లేఖ.. 
 

కాకినాడ‌:   ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ మండిప‌డ్డారు. కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకి.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బహిరంగ లేఖ  రాశారు. 
 కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.. ఇదే సమయంలో.. చట్టబద్ధంగా కేసులు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.. తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని, మీ వల్ల 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని మండిపడ్డారు. అధికారుల బదిలీలలో ఎంత అవినీతి జరిగిందో త్వరలోనే బయటపెడతానని.. ఆరు నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు.

Back to Top