సీఎం వైయస్‌ జగన్‌ కృషికి భారీ ప్రతిరూపం

కరోనా కట్టడికి పోరుపై 12,012 చ.అడుగుల పెయింటింగ్‌కు తెనాలిలో శ్రీకారం

 తెనాలి: కరోనా కట్టడిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న శ్రమ ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడానికి ప్రతిరూపంగా భారీ పెయింటింగ్‌ రూపకల్పనకు శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీకారం చుట్టారు. స్థానిక మున్సిపల్‌ మార్కెట్‌ సెంటర్లో రోడ్డుపై 78 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పుతో మొత్తం 12,012 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద పెయింటింగ్‌ వేయనున్నారు. దీనిని 50 గంటల్లో పూర్తి చేయనున్నారు. మున్సిపల్‌ పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు టి.విజయప్రకాష్, ఇతర ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, పులి భాస్కర్, పరిశ సర్దార్‌తో కలిసి దీనిని రూపొందిస్తున్నారు. ఈ భారీ పెయింటింగ్‌ రికార్డును సృష్టిస్తుందని వారు చెబుతున్నారు. 

Back to Top