దివ్యాంగుల పొట్టగొడితే పుట్ట‌గ‌తులుండ‌వ్‌

మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

పింఛ‌న్ల తొల‌గింపును నిర‌సిస్తూ శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛ‌న్లు తొల‌గించి వాటి పొట్ట గొడితే కూట‌మి ప్ర‌భుత్వానికి పుట్ట‌గ‌తులుండ‌వ‌ని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షురాలు ఉషాశ్రీ చ‌ర‌ణ్ హెచ్చ‌రించారు.  పెన్షన్ తొలగించిన దివ్యాంగులతో కలిసి సోమ‌వారం ఆమె కలెక్టరేట్ ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించి, జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.  క‌లెక్ట‌ర్‌ను క‌లిసేందుకు వెళ్తున్న దివ్యాంగుల‌ను పోలీసులు అడగడుగునా అడ్డగించారు. దీంతో దివ్యాంగుల‌ను ఎత్తుకెళ్లి క‌లెక్ట‌ర్‌కు ప‌రిస్థితిని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ` కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దాదాపు లక్షల దివ్యాంగులకు పెన్షన్లు తొలగించడం దుర్మార్గ‌మ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. విధి వంచితులైన వారి పట్ల మానవత దృక్పథంతో ఉండాల్సింది పోయి, వారిని తీవ్రంగా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయం.  దివ్యాంగులు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైన ఆధారపడి జీవిస్తున్నారు, ఈ పెన్షన్ మీదే వారి బతుకు ఈడుస్తున్నరు. అలాంటి వారి పెన్షన్లు కత్తిరించడం చాలా దారుణం. మేము ఏం పాపం చేశామని మాకు అన్యాయం చేశార‌ని దివ్యాంగులు బాధపడుతున్నారు.  పెన్షన్ తొలగింపు వల్ల వారు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గుర‌య్యే ప్రమాదం ఉంది. కొందరు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పెన్షన్ వెంటనే పునర్దించాలి, లేకుంటే భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తాం` అని ఉషాశ్రీ చ‌ర‌ణ్ హెచ్చ‌రించారు. 

Back to Top