దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

విజయనగరం: విజయనగరంలోని పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశ పోలీసు స్టేషన్‌ను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం వైయస్‌ జగన్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

Back to Top