విజయనగరం జిల్లా: అన్యాయానికి గురవుతున్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ఉంటుందని విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ రాజు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంత్, గుర్ల మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసి నాయుడు, చీపురుపల్లి మండల అధ్యక్షుడు వరహాలు నాయుడు, గరివిడి జడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, గరివిడి అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వర రావు,బెల్లాన బంగారు నాయుడు, తాడ్డి వేణు, కోట్ల వెంకట్రావు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు ఏమన్నారంటే .. సెప్టెంబర్ 24వ తేదీన వైయస్ జగన్ గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగే అన్యాయాలు, దాడులు, హింసించడం, కూటమి నేతలు చేస్తున్న అనైతిక కార్యక్రమాల నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ బుక్ ను వైయస్ జగన్ ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించిందికే వైయస్ జగ న్ డిజిటల్ బుక్ ను తీసుకువచ్చారు. రెడ్ బుక్ లాగా డిజిటల్ బుక్ కక్ష సాధింపు ధోరణి ఉండదు. పార్టీ కార్యకర్తకు ఎవరైతే అన్యాయం చేస్తారో, అక్రమంగా ప్రవర్తిస్తారో,దాడులు చేస్తారో వారికి గుణపాఠం చెప్తాం. డిజిటల్ బుక్ ను క్యూఆర్ కోడ్ తో `digitalbook.weysrcp.com` వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఫిర్యాదు చేయాలి. క్యూఆర్ కోడుతో పాటు, IVRS నెంబర్ ష040-49171718" ద్వారా కూడా మీ ఫిర్యాదులను రికార్డు చేసుకోవచ్చు.