ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

రేపు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు 
 

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌

విజయవాడ: ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా  సీఎం వైయ‌స్ జగన్ చేశార‌ని చెప్పారు. దివంగత ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ఈ నెల 28న ఆదివారం విజయవాడలో నిర్వహిస్తామ‌ని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని తెలిపారు. శ‌నివారం  దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు.  టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. 

కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం వైయ‌స్ జగన్‌ మీటింగ్‌కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు.  

దమ్మున్న నాయకుడిగా సీఎం వైయ‌స్ జగన్ పేదల తరపున పోరాడారు.  ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్‌ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది.  

Back to Top