సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం

కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

తాడేపల్లి: గిరిజనుల హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్‌ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top