ప్రజల ఓటు బ్యాంకు సీఎం వైయ‌స్ జగన్‌కే

 డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

చిత్తూరు: ప్రజల ఓటు బ్యాంకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికేనని, టీడీపీ భూస్థాపితం ఖాయమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శవరాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కుప్పం ఓటమితో మతి భ్రమించిన చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వంపై కక్షసాధింపునకు దిగుతున్నారని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు.  చిత్తూరు జిల్లా ఎల్‌ఆర్‌ పేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదల ఆసరా కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల కరపత్రాలను దగ్ధం చేసినంత మాత్రాన ప్రజలు బాబును నమ్ముతారని అనుకోవడం టీడీపీ నాయకుల మూర్ఖత్వం అన్నారు. 

Back to Top