మద్యపాన నిషేధానికి బాబు వ్యతిరేకి

ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

విజయవాడ: మద్యపాన నిషేధాన్ని అందరూ స్వాగతిస్తే చంద్రబాబు  వ్యతిరేకిస్తున్నాడని ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. సచివాలయంలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మద్యపాన నిషేధానికి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. మద్యం బాటిల్‌ అక్రమంగా అమ్మితే 6 నెలల జైలు శిక్ష విధించేలా అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు. అదే విధంగా బెల్టుషాపులు ఎక్కడైనా కనిపిస్తే నిర్వాహకులను జైలుకు పంపుతామన్నారు. మద్యం ధరలు పెరిగాయని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, ఆ పెరిగిన మద్యం ధరల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. కంపెనీలకు, మద్యం ధరలకు సంబంధం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బాబు మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నాడన్నారు. 
 

Read Also: ఢిల్లీ బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

Back to Top