సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్‌’ కుట్ర రాజకీయం

గుంటూరు: సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసింది. వైయ‌స్‌ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైయ‌స్‌ జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ  సతీష్ కుమార్‌ ప్రకటించారు. 18వ తేదీన 1:20 గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారు.

 
ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు.  అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత కుట్రకు తెరలేపిన టీడీపీ, ఎల్లో మీడియా.. వైయ‌స్‌ జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.

సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఎల్లో గ్యాంగ్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైయ‌స్‌ జగన్ వాహనం ఢీ కొనలేదని ఎస్పీ సతీష్‌ అధికారికంగా ప్రకటించారు. అయినా వైయ‌స్‌ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా బురదచల్లుతోంది. 

Back to Top