గోరంట్ల బుచ్చ‌య్య వ్యాఖ్య‌లు దారుణం

మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఫైర్‌

రాజ‌మహేంద్ర‌వ‌రం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టిడిపిలో సీనియర్ నేత‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచితమైన వ్యాఖ్యలు చేయటం దారుణమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి మార్గాని భ‌ర‌త్ తీవ్రంగా ఖండించారు. వైయస్ జగన్ కేవలం ఒక సినిమా డైలాగ్ గురించి మాత్రమే చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేత లోకేష్ , జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ లు నోటికి వచ్చినట్టు మాట్లాడార‌ని తెలిపారు. మీ మాటలు మీకు ఇప్పుడు గుర్తుకు రావటం లేదా అని ప్ర‌శ్నించారు. అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేస్తూ ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని మార్గాని భరత్ మండిప‌డ్డారు.

Back to Top