చెవిరెడ్డి విడుద‌ల కావాలంటూ ప్ర‌త్యేక పూజ‌లు

అలిపిరి పాదాల వ‌ద్ద వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు గోవిందా నామ స్మ‌ర‌ణ‌

తిరుప‌తి:  మద్యం స్కాం కేసుకు ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశార‌ని, ఆయ‌న విడుద‌ల కావాల‌ని కోరుతూ శ‌నివారం తిరుప‌తిలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. చెవిరెడ్డి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి,  గోవిందా నామ స్మరణలతో  ఏడుకొండల శ్రీనివాసుని చంద్రగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం న‌డుస్తుంద‌ని మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయన్నారు.  చెవిరెడ్డి ఈ కేసులో క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్తార‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

Back to Top