అమరావతి: చంద్రబాబు…ఔరంగజేబు ఒక్కటే అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. నీ తమ్ముడుని మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశావ్.. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు.. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. కుల,మతాలను రెచ్చగొట్టే వ్యక్తి నువ్వు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వ్వు రావాలని నారాయణస్వామి సవాలు విసిరారు.
పేదవారిని దగ్గర తీసుకున్న చరిత్ర నీకుందా చంద్రబాబు? సత్య హరిశ్ఛంద్రుడిని వైయస్ జగన్ రూపంలో చూశామన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంధి పలుకుతుందన్నారు. పులివెందులకు ధీటుగా కుప్పంలో మెజారిటీ రాబోతోందన్నారు. దొంగ ఓట్లతో 6 పర్యాయాలు గెలిచావ్ చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. ఏనాడైనా పేదల అకౌంట్లలో రూపాయి అయినా వేశావా? కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ పచ్చ చేస్తాడన్నారు.
సారాను తీసుకొచ్చిందే టీడీపీ. మద్యం మీద బ్రతికిందే టీడీపీ.. నేనేమీ పారిపోను …మద్యం పై చర్చించడానికి ఎప్పుడూ సిద్ధమే. టైం ఇస్తే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. కులవ్యవస్థ, మత వ్యవస్థని తెచ్చింది మీరు. రామారావు గురించి మాట్లాడితే ఎవరూ వినరు. అసలు మీకు ఆ అర్హత లేదన్నారు.