బాబు గురించి మీ భ‌ర్త పుస్త‌కం రాశార‌ని మ‌ర్చిపోయారా..?

పురందేశ్వ‌రికి డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్న‌

నంద్యాల జిల్లా: ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష ఎందుకు ఉంటుందని డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబును అక్రమంగా అరెస్టు చేయలేదని, అన్ని ఆధారాలతోనే సీఐడీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచార‌ని చెప్పారు. శ్రీ‌శైలంలో డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే స్కిల్‌ స్కామ్‌ ఆధారాలున్న ఫైల్స్‌ తగులబెట్టారని చెప్పారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వరి.. టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోందన్నారు. రాజ‌మండ్రి జైల్లో ఉన్న‌ చంద్రబాబుకు ఇంటి భోజనం వస్తోందని, జైలుకు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఇప్పటివరకు బాబు కేజీ బరువు పెరిగారన్నారు. పురంధేశ్వరి చెల్లి కొడుకు లోకేష్‌ను తీసుకొని కేంద్ర‌మంత్రి అమిత్ షాను కలిసింద‌ని, గతంలో ఆమె భర్త చంద్రబాబు గురించి పుస్త‌కం రాశార‌న్న సంగ‌తి మర్చిపోయారా అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్ర‌శ్నించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top