వైయస్‌ఆర్‌ సుజల ధార ప్రాజెక్టుకు భూమిపూజ

ఉద్దానం ప్రజలకు శుద్ధ జలాలు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు 

భూమిపూజ చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి సీదిరి

శ్రీకాకుళం: ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు శుద్ధ జలాలను అందించేందుకు ‘వైయస్‌ఆర్‌ సుజల ధార’ ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు భూమిపూజ చేశారు. ఉద్దానం ప్రాంతానికి వంశధార నీటిని అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.700 కోట్లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. బెండి కొండపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో ఉద్దానం ప్రాంతం(ఇచ్ఛాపురం, పలాస)లోని రెండు మున్సిపాలిటీలు, ఏడు మండలాల పరిధిలోని దాదాపు 809 నివాసిత ప్రాంతాలకు శుద్ధ జలాల సరఫరా జరగనుంది. 

Back to Top