అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

ఆంధ్రరాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన సాగుతోంది

గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన చేరింది

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

విజయనగరం: నవరత్నాల్లో అత్యంత ప్రధానమైన ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా సాగుతోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యానికి పెద్దపీట వేయడంతో పాటు..  సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన సాగుతోందన్నారు. గుంకలాంలో ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల వద్దకే పాలన చేరిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వ్యవసాయాధారిత ప్రాంతాలు అని, ఆనాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తిచేసి.. జిల్లాకు నీటి కొరతను తీర్చాలని సీఎంను కోరారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపుతో ఆలోచిస్తారని, ఆ దూరదృష్టితోనే అనేక పథకాలు అమలు చేశారన్నారు. భూముల సమగ్ర రీ సర్వే లాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని తీసుకువచ్చారన్నారు. కిడ్నీ రోగులకు శుద్ధ జలాలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును తీసుకువచ్చారన్నారు. 

Back to Top