ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్‌ జగన్‌

56 కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీల్లో మనోధైర్యాన్ని పెంచారు

విజయవాడ వైయస్‌ఆర్‌ పార్కు వద్ద బీసీల సంబరాలు

పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ నేతలు

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, బీసీ గర్జనలో ప్రకటించిన విధంగా బీసీలకు పెద్దపీట వేశారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ప్రకటించడంతో విజయవాడలోని వైయస్‌ఆర్‌ పార్కు వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. వైయస్‌ఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు బీసీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీసీల ఆశాజ్యోతి సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్, పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేష్, భవకుమార్, సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. 56 కార్పొరేషన్ల ఏర్పాటును బీసీలంతా పండుగలా జరుపుకుంటున్నారని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బీసీ గర్జనలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారన్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు పెద్దపీట వేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలలో మనోధైర్యాన్ని పెంచారన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు.  
 

Back to Top